సుమిత్ సూపర్
- ప్రపంచ చాంపియన్‌పై అద్భుత విజయం
- స్ట్రాంజా బాక్సింగ్ టోర్నీ
న్యూఢిల్లీ: స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో సుమిత్ కుందు సంచలన ప్రదర్శనతో అదరగొట్టాడు. సోమవారం జరిగిన పురుషుల 75కిలోల తొలి రౌండ్లో సుమిత్ 5-0 తేడాతో ప్రపంచ చాంపియన్‌షిప్ రజత విజేత బిజమోవ్(రష్యా)పై అద్భుత విజయం సాధించాడు. కెరీర్లో రెండో సీనియర్ టోర్నీలో బరిలోకి దిగిన సుమిత్..తన కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న బిజమోవ్ను చిత్తుచిత్తుగా ఓడించాడు. ఆది నుంచే తనదైన జోరు కనబరిచిన ఈ యువ రెజ్లర్ పదునైన పంచ్‌లతో విరుచుకుపడ్డాడు. ఎక్కడా తడబాటుకు లోనుకాకుండా హుక్స్, జాబ్స్‌తో చెలరేగుతూ కీలక పాయింట్లు కొల్లగొట్టాడు. రెండో రౌండ్లో ఉక్రెయిన్ బాక్సర్ అలెగ్జాండర్ కిగ్జినియాక్తో సుమిత్ తలపడనున్నాడు. మరోవైపు నరేందర్ బెర్వాల్(92కి), వరిందర్సింగ్(60కి), లక్ష్య చాహర్(86కి) తొలి రౌండ్లో ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించారు. మహిళల కేటగిరీలో శిక్ష(54కి), నీతు(48కి), అనామిక(50కి) మంగళవారం బరిలో దిగనున్నారు. యూరప్‌లో పురాతన టోర్నీగా పేరొందిన స్ట్రాంజా చాంపియన్‌షిప్‌లో భారత్ నుంచి ఈసారి 17 మంది బాక్సర్లు పోటీలో ఉన్నారు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

