Sujeeth | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు లైఫ్‌టైమ్ మెమరీగా నిలిచిన సినిమా “ఓజీ”. పవన్‌కు బిగ్గెస్ట్ ఫ్యాన్‌గా పేరొందిన యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించి, పవన్ ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. సినిమా విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా “ఓజీ” ప్రస్తావన వస్తూనే ఉంది. ఇలాంటి సినిమాను అందించిన సుజీత్‌కు ఇటీవల పవన్ కళ్యాణ్ ఓ ఖరీదైన లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన విషయం పెద్దగా వైరల్ అయ్యింది. అయితే ఈ గిఫ్ట్ వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
“ఓజీ” సినిమా షూటింగ్ సమయంలో సుజీత్ కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా, ప్రాజెక్ట్‌పై తన వ్యక్తిగత ఆసక్తిని పూర్తిగా పెట్టాడని టాక్. సినిమాలోని కొన్ని కీలక ఎలిమెంట్స్‌కు సంబంధించి ముఖ్యంగా ఓజీ కామిక్స్ ఐడియా, విజువల్ డిజైన్, కొన్ని ప్రత్యేక కాన్సెప్ట్‌లు తన సొంత ఖర్చుతోనే సుజీత్ ముందుకు తీసుకెళ్లాడట. బడ్జెట్ పరిమితులున్నప్పటికీ, సినిమాకు ఎలాంటి కాంప్రమైజ్ చేయకూడదనే ఉద్దేశంతో, తనకు ఎంతో ఇష్టమైన లగ్జరీ కారును కూడా అమ్మి షూటింగ్ అవసరాల కోసం డబ్బు వినియోగించాడన్న విషయం అప్పట్లో సినీ వర్గాల్లో వినిపించింది.
ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి షూటింగ్ పూర్తైన తర్వాత ఆలస్యంగా వెళ్లిందట. సినిమా కోసం ఒక దర్శకుడు తన సొంత వాహనాన్ని అమ్ముకునే స్థాయికి వెళ్లాడని తెలుసుకున్న పవన్ చాలా ఎమోషనల్ అయ్యారట. అప్పుడు సుజీత్ చేసిన త్యాగాన్ని గుర్తించి, సినిమా పూర్తైన తర్వాత అతడికి మళ్లీ అదే స్థాయి లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇవ్వాలని పవన్ నిర్ణయించుకున్నారని సమాచారం. కారు గిఫ్ట్ విషయం బయటకు రాగానే సోషల్ మీడియాలో పలు రకాల ట్రోల్స్ వచ్చాయి. “కారు ఇచ్చారు కానీ EMIలు మాత్రం సుజీత్‌నే కట్టుకోవాలేమో” అంటూ కొందరు కామెంట్స్ చేశారు. అయితే వాటికి చెక్ చెబుతూ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ కేవలం కారు కొనివ్వడమే కాకుండా, దానికి సంబంధించిన ఇన్స్టాల్మెంట్స్ (EMIలు) కూడా ప్రతీ నెల ఆయనే భరిస్తారని తెలుస్తోంది.
మొత్తానికి, “ఓజీ” సినిమా వెనుక సుజీత్ చూపిన డెడికేషన్‌కు, త్యాగానికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ బహుమతి ఇప్పుడు ఇండస్ట్రీలో అరుదైన సంఘటనగా చెప్పుకుంటున్నారు. ఇది పవన్ కళ్యాణ్ పెద్దతనానికి, టీమ్‌పై ఆయనకు ఉన్న గౌరవానికి మరో ఉదాహరణగా నిలుస్తోంది.