
ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 18: విద్యార్థులు పరిశోధనల వైపు దృష్టి సారించాలని సీసీఎంబీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ సీహెచ్ మోహన్రావు పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ జువాలజీ విభాగం లో ‘ఇన్నోవేటివ్ చాలెంజెస్ ఇన్ ఐప్లెడ్ యాస్పెక్ట్స్ ఆఫ్ జువాలాజికల్ సైన్సెస్ (ఎన్ఎస్ఐసీఏజడ్ఎస్)’ పై రెండు రోజుల జాతీయ సింపోజియం నిర్వహిస్తున్నారు. ఓ యూ సైన్స్ కళాశాలలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ మో హన్రావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ కుటుంబ పరిస్థితులు, మౌలిక వసతుల ఆధారంగా చేసుకుని జీవితంలో పరిమితం కాకూడదని సూచించారు. గొప్ప శాస్త్రజ్ఞులను ఆదర్శంగా తీసుకుని, తమ లక్ష్య సాధన కోసం పాటుపడాలని పిలుపునిచ్చా రు. జీవితంలో జువాలజిస్ట్ల ప్రాముఖ్యతను వివరించారు.
నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం 2022 నుంచి ప్రతి ఏటా ఒక్కో నోబుల్ అవార్డు గ్రహీత పేరు మీద ఏడాది పొడుగునా వివిధ కార్యక్రమాలు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. 2022వ సంవత్సరానికి గాను డాక్టర్ హరగోబింద్ ఖు రానా పేరుపై కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నా రు. ఖురానా చేసిన సేవలను కొనియాడారు. ఖురానా లాంటి గొప్పవారిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొ.రవీందర్, సైన్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొ.ఏ.బాలకిషన్, ఓఎస్డీ టు వీసీ ప్రొ. రెడ్యానాయక్, ప్రిన్సిపాల్ ప్రొ.వీరయ్య, ఓయూ పీఆర్వో డా.శ్రీనివాసులు, కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొ. మాధవి, సంయుక్త కార్యనిర్వాహక కార్యదర్శులుగా డా.వెంకటేశ్వరరావు, డా.రాజశేఖర్ పాల్గొన్నారు.