చేస్తున్నాయి. మెదక్, సంగారెడ్డి జిల్లాలో సందడి చేస్తున్నాయి. చెట్లపై భారీగా విడిది చేస్తూ, పక్కనే ఉన్న చెరువుల్లో చేపలను వేటాడుతూ సేదదీరుతున్నాయి. ఈ దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తున్నాయి.
– సంగారెడ్డి/మెదక్ ఫొటోగ్రాఫర్స్, నమస్తే తెలంగాణ
ప్రకృతి అందాలకు పెట్టింది పేరు మెతుకుసీమ. పచ్చని పంట చేళ్లు.., ఆకట్టుకునే ఆకుపచ్చని వృక్షాలు.., గలగలా పారేటి జల సవ్వడులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఆ అందాలకు పర్యావరణ ప్రేమికులే కాదు.., మూగజీవాలు కూడా ఫిదా కావాల్సిందే. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని పంట చేళ్లు, నీటి వనరుల వద్ద కొంగలు కోలాహలం చేస్తున్నాయి. మెదక్ జిల్లా హవేళిఘనపూర్ చెరువుతో పాటు పరిసర ప్రాంతాల్లోని పంట పొలాల వద్ద, సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మహబూబ్‌సాగర్ చెరువు, మంజీరా డ్యామ్ ఎగువ ప్రాంతంలో పక్షులు ఇలా సందడి చేశాయి…