హనుమకొండ చౌరస్తా, జూన్ 13 : మలక్‌పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు అత్యంత అరుదైన, అత్యాధునిక ట్రాన్స్ కాథెటర్ అయోర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ (టీఏవీఐ) ప్రక్రియను విజయవంతంగా నిర్వహించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న 75 ఏళ్ల వృద్ధ రోగికి నూతన జీవితం ప్రసాదించినట్లు ఆస్పత్రి కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బి.వెంకట్‌రెడ్డి తెలిపారు. శనివారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేటకు చెందిన 75 ఏళ్ల వంటేరు మల్లయ్య తీవ్ర డీజెనరేటివ్ బైకస్పిడ్ అయోర్టిక్ వాల్వ్ వ్యాధి, తీవ్రమైన కాల్సిఫిక్ అయోర్టిక్ స్టెనోసిస్ సమస్యతో బాధపడుతూ మలక్‌పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆశ్రయించగా సమగ్ర వైద్య పరీక్షలు, గుండె రక్తనాళాల పరీక్ష (సీఏజీ) అనంతరం ఫిబ్రవరి 4న అత్యాధునిక గుండె వాల్వ్ మార్పిడి ప్రక్రియ నిర్వహించినట్లు తెలిపారు.
అయోర్టిక్ స్టెనోసిస్ అనేది గుండెలోని అయోర్టిక్ వాల్వ్ తీవ్రమైన స్థాయిలో కుంచించుకుపోయే వ్యాధి, ముఖ్యంగా వృద్ధుల్లో వాల్వ్‌పై కాల్షియం పేరుకుపోవడం వలన రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతినొప్పి, గుండె వైఫల్యం, స్పృహ కోల్పోవడం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని సమయానికి చికిత్స చేయకపోతే ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంటుందన్నారు. ఓపెన్‌హార్ట్ సర్జరీ అవసరం లేకుండా కాథెటర్ ద్వారా వాల్వ్ మార్పిడి మెరిల్ మైవాల్ కృత్రిమ అయోర్టిక్ వాల్వ్ విజయవంతంగా అమరిక వాల్వ్‌పై ఉన్న ఒత్తిడి (గ్రేడియెంట్) 70 ఎంఎంహెచ్‌జీ నుంచి 9 ఎంఎంహెచ్జీకు తగ్గింపు, ప్రక్రియ అనంతరం ఎలాంటి వాల్వ్ లీకేజ్ లేకపోవడం, వెంటనే మెరుగైన గుండె పనితీరు సాధించడం, శస్త్ర చికిత్స అనంతరం రోగి క్రమంగా కోలుకుని స్థిరస్థితికి చేరుకున్నారని వివరించారు.
అత్యంత అరుదైన టీఏవీఐ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసినట్లు, తీవ్రమైన అయోర్టిక్ వాల్వ్ అడ్డంకి తొలగింపు, గుండెకు రక్తప్రసరణ గణనీయంగా మెరుగుదల, ఎలాంటి శస్త్రచికిత్సానంతర సమస్యలు లేకపోవడం వృద్ధరోగి ఆరోగ్య పరిస్థితితో కోలుకున్నట్లు చెప్పారు. మలక్‌పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రస్తుతం తెలంగాణలో అత్యాధునిక ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, స్ట్రక్చరల్ హార్ట్ ఇంటర్వెన్షన్స్, క్లిష్ట గుండె సంబంధిత చికిత్సలకు ప్రముఖ కేంద్రంగా ఎదిగిందని ఆసుపత్రి డైరెక్టర్ గోరుకంటి పవన్, యూనిట్ హెడ్ కె.శ్రీనివాస్ రెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదుర తెలిపారు. అత్యాధునిక క్యాథ్ ల్యాబ్స్, అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టులు, 24 గంటల క్రిటికల్ కేర్ సదుపాయాలు, సమగ్ర వైద్య బృందం సమన్వయంతో అత్యంత క్లిష్టమైన గుండె వ్యాధులకు కూడా ప్రపంచస్థాయి చికిత్సను అందిస్తున్నామని తెలిపారు. మరిన్ని వివరాలకు ఎ. వాసుకిరణ్ రెడ్డి 97057 71230, 99499 98378 నెంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.