‘రేషన్ బియ్యంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న రాష్ట్ర మంత్రులు’
కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యాన్ని తమ ఖాతాలో వేసుకుంటూ రాష్ట్ర మంత్రులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకూరి రమేశ్ అన్నారు. జూలూరుపాడులో శనివారం నిర్వహించిన బీజేపీ మండల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద...
– కేంద్ర నిధులను తమ ఖాతాలో వేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం
– హామీల అమలులో విఫలమై అన్ని వర్గాలను మోసం చేశారు
– బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకూరి రమేశ్
జూలూరుపాడు, నవంబర్ 21 : కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యాన్ని తమ ఖాతాలో వేసుకుంటూ రాష్ట్ర మంత్రులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకూరి రమేశ్ అన్నారు. జూలూరుపాడులో శనివారం నిర్వహించిన బీజేపీ మండల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద దేశంలోని ప్రతి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యం లేదా గోధుమలను ఉచితంగా అందజేస్తోందని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినా రేషన్ కార్డు మారకుండానే దేశంలో ఏ రేషన్ దుకాణంలోనైనా ఉచిత రేషన్ పొందే వెసులుబాటును కేంద్రం కల్పించిందన్నారు. రాష్ట్రాలు అదనంగా బియ్యం ఇవ్వాలనుకుంటే కేజీ బియ్యాన్ని రూ. 3 కే కేంద్రం సరఫరా చేస్తోందని వివరించారు. తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో లేకుండా సీఎం, రాష్ట్ర మంత్రుల ఫోటోలు ముద్రించి, 6 కిలోల సన్న బియ్యం తామే ఇస్తున్నామని ప్రచారం చేసుకోవడం దారుణమని రమేష్ విమర్శించారు. ఆయా రాష్ట్రాల ఆహార అలవాట్లకు అనుగుణంగా ధాన్యం కొనుగోలుకు మద్దతు ధరతో పాటు బస్తాలు, రవాణా, మిల్లింగ్ ఛార్జీలు, కమిషన్ ఖర్చులతో సహా కేంద్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక కిలో బియ్యం అదనంగా ఇచ్చి, మొత్తం తామే ఇస్తున్నామని చెప్పడం సరికాదని, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మంత్రులే అబద్ధాలు చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన దుయ్యబట్టారు. వృద్ధులకు రూ. 4 వేల పింఛన్ ఇస్తామని చెప్పి మూడేళ్లు గడుస్తున్నా అమలు చేయలేదని, రాష్ట్రంలో కొత్తగా ఒక్కరికీ పింఛన్ మంజూరు చేయలేదని ఆరోపించారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ. 2,500, డిగ్రీ విద్యార్థినులకు స్కూటీలు, నిరుద్యోగులకు రూ. 4 వేల భృతి, వ్యవసాయ కూలీలు, ఆటో డ్రైవర్లకు రూ. 12 వేలు, దళితులకు రూ. 12 లక్షలు, గిరిజనులకు రూ. 10 లక్షలు ఇస్తామని చెప్పి ఒక్క నయా పైసా ఇవ్వలేదని విమర్శించారు. వడదెబ్బతో మరణించిన రైతులకు రూ. 4 లక్షల పరిహారం ఇస్తామన్న హామీ కూడా నెరవేరలేదన్నారు. అతివృష్టి, అనావృష్టితో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఫసల్ బీమా యోజన’ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా వంద శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాగుతోందని, ఆ విషయాన్ని దాచిపెట్టి రాష్ట్ర ప్రభుత్వం సొంత ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని నమ్మించి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు భూక్య రమేష్, నాయకులు తెల్లం నరసింహారావు, మండల ప్రధాన కార్యదర్శి నిమ్మటూరి రామారావు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు సిరిపురపు పుల్లారావు, ధరావత్ బాలకిషన్, గుగ్గులోత్ రాంబాబు, భూక్య రవి, వందనపు సుబ్బు, కిరణ్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ బియ్యంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న రాష్ట్ర మంత్రులు’
ACB Raid | రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన విద్యుత్ శాఖ సబ్ ఇంజినీర్
Manne Krishank | రేవంత్ కూతురు కార్పొరేట్ స్కూల్స్.. పొంగులేటి కూతురేమో ఇంటర్నేషనల్ స్కూల్స్ : మన్నె క్రిశాంక్
Spurious Liquor | మణిపూర్ కల్తీ మద్యం దుర్ఘటన.. 13కు పెరిగిన మృతుల సంఖ్య.. ఆస్పత్రుల్లో 300 మంది..!
రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు విద్యార్థి సి.హెచ్.లోహిత్ ఎంపిక
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

