వనస్థలిపురం, జనవరి 22 : క్రీడలపై ఆసక్తి ఉన్నవారిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వనస్థలిపురంలోని సర్థార్ వల్లభాయ్ పటేల్ మైదానంలో నిర్వహిస్తున్న రాష్ర్టస్థాయి చాంపియన్‌షిప్ పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో బీఎన్‌రెడ్డినగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, కుంట్లూరు వెంకటేశ్ గౌడ్, మాధవరం నర్సింహా రావు, మెట్టు సంతోశ్ రెడ్డి, ముడుపు సందీప్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మేనేజర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.