Srisailam Temple | శ్రీశైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల క్షేత్రం ముస్తాబైంది. ఈ నెల 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.
2/24
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు ఆర్జిత సేవలను రద్దు చేశారు. శివదీక్షాపరులకు 19 నుంచి 23 వరకు స్పర్శ దర్శనాలు కల్పించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
3/24
జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైలం దేవస్థానానికి శివరాత్రికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.
4/24
ఈ మేరకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
5/24
శివదీక్షాపరులతో పాటు ఆలయానికి వచ్చే ఇతర భక్తుల కోసం సైతం ఏర్పాట్లు చేసింది.
6/24
దర్శనాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.