ఆ ముగ్గురే ప్రపంచం!
ఆట, పాట, నటన, చదువు.. అన్నింటా ముందుంటుంది. బాల నటిగా తెరంగేట్రం చేసి, ఇప్పుడు రబ్బరుబొమ్మలా ముస్తాబై తెలుగువారి ముందు కొస్తున్నది నటి అంకిత అమర్. ఒకే రంగంలో స్థిరపడటం కంటే, మల్టీ టాస్కింగ్‌తో సత్తా చాటడమే మేలంటున్న స్టార్ మా ‘శ్రీమతి శ్రీనివాస్’ ఫేమ్ అంకిత ‘జిందగీ’తో పంచుకున్న ముచ్చట్లు..

మాది మైసూరు. కానీ బెంగళూరులో స్థిరపడ్డాం. అమ్మానాన్న స్టేజ్ ఆర్టిస్ట్‌లు. దీంతో చిన్నప్పటినుంచే నటన అలవాటైంది. బాలనటిగా ఓ కన్నడ సినిమాలో నటించాను. డ్యాన్స్, పాటలు నా ప్రాణం. ‘చదువు పూర్తయ్యాకే ఏదైనా..’ అని నాన్న కచ్చితంగా చెప్పడంతో నటన పక్కనపెట్టి చదువు మీద దృష్టి పెట్టా. మా కాలేజీ నుంచి మెడికల్ బయో కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ చేసిన మొదటి విద్యార్థిని నేనే. అందులోనూ డబుల్ గోల్డ్ మెడలిస్ట్‌ని. పీహెచ్డీ ప్రయత్నాల్లో ఉండగా ‘కలర్స్ కన్నడ’ చానల్ నుంచి పిలుపు వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ‘వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు’ అని నాన్న సలహా ఇచ్చారు. ఆ మాటతో ఎక్కడలేని ధైర్యం వచ్చింది. వెంటనే ఒప్పుకొన్నా.
తెలుగు లోగిళ్లలోకి..
‘శ్రీమతి శ్రీనివాస్’తో ‘స్టార్ మా’ ద్వారా తెలుగువారి ఇంటి కొస్తున్నా. ప్రతి అమ్మాయి జీవితంతో ముడిపడిన కథ ఇది. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడిప్పుడే తెలుగు మాట్లాడుతున్నా. భాష ఏదైనా భావం ఒక్కటే. వేళలు, స్థలాలు వేరువేరు కావచ్చు కానీ, పని విధానం ఒకేలా ఉంటుంది. నాకు మల్టీటాస్కింగ్ అంటే ఇష్టం. ట్రెండ్‌కు తగినట్టు.. మనం ఎన్ని రంగాల్లో రాణించగలమో అన్నిటిపైనా దృష్టిపెట్టాలి. అన్నిటినీ సమన్వయం చేసుకోగలగాలి.
గాయనిగా, నృత్యకారిణిగా నిరూపించుకోవాలన్నది నా ఆశయం. శాస్త్రీయ సంగీతం కూడా నేర్చుకుంటున్నా. లాక్డౌన్ కారణంగా ఇంట్లో కూర్చునే ఆన్లైన్ పాఠాలు వింటున్నాగానీ, లేకపోతే సంగీతం క్లాసుల కోసం రోజూ బెంగళూరు నుంచి మైసూర్ వెళ్లేదాన్ని. పీహెచ్డీ చేసి మెడికల్ స్టూడెంట్స్‌కి పాఠాలు చెప్పాలనేది నా కల. టీచింగ్ అంటే చిన్నప్పటినుంచీ ఇష్టం. టీచర్‌గా ఎన్నో విషయాలను నేర్చుకునే అవకాశం ఉంటుంది. మంచి కథలు వస్తే సినిమాల్లోనూ నటిస్తా.

ఆయనే స్పూర్తి
కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్‌కుమార్‌గారు నాకు ఆదర్శం. నటుడిగా నిరూపించుకుంటూనే పాటలూ పాడారు. గొప్ప గాయకుడిగా పేరు తెచ్చుకొని నేషనల్ అవార్డు అందుకున్నారు. ఆయన క్రమశిక్షణ, మల్టీ టాస్కింగ్ స్కిల్స్ నాకు స్ఫూర్తి. సీనియర్ నటీనటుల్లో మంచి లక్షణాలను గమనిస్తూ ఉంటాను. డ్యాన్స్ బాగా చేసేవారి నుంచి డ్యాన్స్, ైస్టెల్‌గా ఉండేవారి నుంచి ైస్టెల్, బాగా నటించే వారి నుంచి నటన.. ఇలా ప్రతి ఒక్కరిలోని మంచినీ స్వీకరిస్తాను. నన్ను నేను పరిపూర్ణంగా మలుచుకుంటాను. అమ్మ, నాన్న, చెల్లి.. నా ప్రపంచం. ప్రతి విషయంలోనూ వాళ్లు నాకు అండగా ఉంటున్నారు. అడుగడుగునా ప్రోత్సహిస్తున్నారు. ఇక నా బలం, నా శక్తి.. అభిమానులే. ఆ ఆదరాభిమానాలు ఉన్నంతకాలం వీక్షకులను అలరిస్తూనే ఉంటాను.
- ప్రవళిక వేముల
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- ankita
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

