Arjuna Ranatunga : శ్రీలంక వరల్డ్ కప్ హీరో అర్జున రణతుంగ (Arjuna Ranatunga)కు అవినీతి కేసులో కోర్టు పెద్ద షాకిచ్చింది. పెట్రోలియం శాఖ మంత్రిగా ఈ మాజీ సారథి భారీ కుంభకోణానికి పాల్పడినట్టు సోమవారం కోర్టు వెల్లడించింది. కాంట్రాక్ట విధానాన్ని మార్చి.. అధిక ధరకు కాంట్రాక్టు కేటాయించడం ద్వారా రణతుంగా అవినీతికి పాల్పడడ్డారని, సోదరుడితో కలిసి రూ.23 కోట్ల స్కామ్‌కు తెరతీశారని కోర్టు తెలిపింది. దాంతో.. ఈ దిగ్గజ క్రికెటర్‌ను లంక ప్రభుత్వం త్వరలోనే అరెస్ట్ చేయనుంది.
శ్రీలంకకు ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన రణతుంగ రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆ సమయంలోనే రణతుంగ, అతడి సోదరుడు రూ.23 కోట్ల అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. శ్రీలంకలో సుదీర్ఘ కాలంగా అమలులో ఉన్న చమురు కొనుగోలు కాంట్రాక్ట్ విధానాన్ని రణతుంగ మార్చేశారు. అత్యధిక ధరకు అప్పటికప్పుడు కొనే విధానికి శ్రీకారం చుట్టడంతో ప్రభుత్వానికి రూ.23.5 కోట్ల నష్టం వాటిల్లింది’ అని అవినీతి నిరోధక శాఖ కోర్టుకు తెలిపింది.
Court orders the release on bail of Dammika Ranatunga, a former chairman of the Ceylon Petroleum Corporation, who was arrested by the Bribery Commission.
The Bribery Commission informs court that it will arrest and produce before court former minister Arjuna Ranatunga, who has… pic.twitter.com/dMndHg7ZHO
— Sri Lanka Tweet 🇱🇰 (@SriLankaTweet) December 15, 2025
దాంతో.. రణతుంగను దోషీగా తేల్చిన కోర్టు అరెస్ట్‌కు ఆదేశాలిచ్చింది. మాజీ కెప్టెన్ సోదరుడు సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్ ధమ్మిక రణతుంగ(Dhammika Ranatunga)ను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ, కాసేపటికే అతడు బెయిల్ మీద విడుదలయ్యాడు. అయితే.. దేశం విడిచి వెళ్లకుండా ధమ్మికపై ట్రావెల్ బ్యాన్ విధించింది కోర్టు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అర్జున రణతుంగను సైతం స్వదేశం రాగానే అరెస్ట్ చేయనున్నారు. 1996 వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంకను తొలిసారి విశ్వ విజేతగా నిలిపాడు రణతుంగ. ఇక… ఈ కేసు గురించిన తదుపరి విచారణ వచ్చే ఏడాది మార్చి 13కు వాయిదా వేసింది.
Sri Lanka to arrest 1996 World Cup-winning captain Arjuna Ranatunga over ‘Rs 23.5 Crore’ oil scam#SriLanka #SriLankaCricket #Crickethttps://t.co/caKJb2WfYG
— CricketNDTV (@CricketNDTV) December 15, 2025