ముంబై: సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తన స్పీడ్‌తో థ్రిల్ పుట్టిస్తున్నాడు. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 157 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత వేగవంతమైన బౌలింగ్ కావడం విశేషం. ఈ సీజన్లో ఉమ్రాన్ దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ 150 కిలోమీటర్ల స్పీడ్‌తో బౌలింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. రాకెట్ స్పీడ్‌తో తన రికార్డులను తానే తిరగరాస్తున్నాడు. ఢిల్లీ బ్యాటర్ రోవ్మాన్ పావెల్‌కు ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఉమ్రాన్ 157 కిలోమీటర్ల వేగంతో బౌల్ చేశాడు. అయితే పావెల్ ఆ బంతిని ఎక్స్ట్రా కవర్, మిడాఫ్ మీదుగా బౌండరీకి తరలించాడు. ఉమ్రాన్ తన పేస్‌తో ఆకట్టుకుంటున్నా.. చివరి రెండు మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీయలేదతను. ఇప్పటి వరకు 10 మ్యాచుల్లో ఉమ్రాన్ 15 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. చెన్నైతో మ్యాచ్‌లో 48 రన్స్ ఇచ్చుకోగా.. ఢిల్లీతో మ్యాచ్‌లో 52 రన్స్ సమర్పించాడు.
— Jemi_forlife (@jemi_forlife) May 5, 2022