కెరీర్ ప్రారంభంలో కథానాయిక శ్రీలీలను ట్రోలింగ్స్ చాలా ఇబ్బంది పెట్టాయట. ఈ కారణంగా ఓ దశలో ఆమె కన్నీటి పర్యంతం అయ్యిందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించింది శ్రీలీల. ‘నేను చాలా సెన్సిటీవ్. అందుకే కెరీర్ తొలినాళ్లలో నాపై వచ్చిన ట్రోల్స్ చూసి తట్టుకోలేకపోయాను. ఒంటరిగా కూర్చొని ఏడ్చేదాన్ని. ఓ దశలో అవి శృతిమించడంతో నా మనసంతా నిరాశ అలముకుంది.
సినిమాలు నా ఒంటికి పడవని నిర్ణయానికి వచ్చేసి, ఆ విషయాన్ని అమ్మకు చెప్పాను. కాలేజ్‌కెళ్లి చదువుకుంటానన్నాను. అప్పుడు అమ్మ చెప్పిన మాటలు నాలో మార్పుని తెచ్చాయి. ‘నీ గురించి వాళ్లు అంత సమయాన్ని వృధా చేసుకుంటున్నారంటే నువ్వు ఎదిగావని అర్థం. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప హీరోయిన్ కాలేరు. ఈ ఫేమ్ తేలిగ్గా రాదు.. అర్థం చేసుకో..’ అని అమ్మ నచ్చజెప్పింది. అప్పట్నుంచి ట్రోల్స్‌ని చదవడం, చూడటం మానేశా. నెగిటివ్ కామెంట్స్‌ని ఎలా డీల్ చేయాలో నేర్చుకున్నా’ అంటూ తనలో వచ్చిన మార్పు గురించి గర్వంగా చెప్పుకున్నది శ్రీలీల.