Sree Leela | కొన్నాళ్లుగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్న హీరోయిన్ శ్రీలీల (Sree Leela) . బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ భామ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి స్కంద (Skanda). బోయపాటి శ్రీను (Boyapati Srinu), ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ (Ram Pothineni) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ నీ చుట్టూ చుట్టూ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. ఇప్పటికే తన డ్యాన్సింగ్ స్కిల్స్‌తో ఔరా అనిపిస్తున్న శ్రీలీల.. ఈ సారి డోస్ పెంచేసింది.
స్టైలిష్ కిల్లింగ్ డ్యాన్స్‌తో ఫ్లోర్‌ను షేక్ చేసేస్తుంది. ఈ పాటలో రామ్‌ను మించిపోయేలా శ్రీలీల చేస్తున్న డ్యాన్స్ చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ షాకవుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ మాస్ ఎనర్జీకి ఏ మాత్రం తగ్గకుండా వారితో పోటీపడేలా శ్రీలీల డ్యాన్స్ చేస్తోందని అంటున్నారు సినీ జనాలు. మొత్తానికి సినిమా సినిమాకు హాట్ టాపిక్‌గా మారుతూ అభిమానుల్లో జోష్ నింపుతోంది శ్రీలీల.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గాతెరకెక్కుతున్న స్కంద సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. నీ చుట్టూ చుట్టూ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ కలర్ఫుల్గా సాగుతూ.. డ్యాన్సింగ్ అండ్ మ్యూజిక్, మూవీ లవర్స్‌కు విజువల్ ట్రీట్ అందిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో లాంఛ్ చేయగా.. అన్ని భాషల్లో మంచి స్పందన రాబట్టుకుంటోంది.
రామ్- బోయపాటి టీం స్కంద చిత్రాన్ని అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది . ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
నీ చుట్టూ చుట్టూ సాంగ్..
స్కంద టైటిల్ గ్లింప్స్..