మక్తల్ : ఖేలో ఇండియా సౌత్ జోన్ సైక్లింగ్ పోటీలకు(Cycling Competitions) ఎంపికైన క్రీడాకారులను నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గోపాలం సన్మానించారు. సోమవారం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సైకిల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఆదేశాల మేరకు, ఈనెల 13న మక్తల్ మినీ స్టేడియంలో ఉమ్మడి జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీల ఎంపిక ప్రక్రియను చేపట్టామని వివరించారు.
ఈ పోటీలలో 30 మంది విద్యార్థులు ఖేలో ఇండియా సౌత్ జోన్ పోటీలకు ఎంపికైన వారికి ప్రశంసపత్రంతో పాటు, మెడల్స్ అందించారు. కార్యక్రమంలో సైక్లింగ్ అసోసియేషన్ నారాయణపేట జిల్లా కోశాధికారి రూప, నిర్వాహకులు రమేష్ కుమార్, దామోదర్, అమ్రేష్, క్రీడాకారులు పాల్గొన్నారు.