భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య గుర్తింపు రద్దు.. కేంద్ర క్రీడా శాఖ సంచలన నిర్ణయం
పరిపాలనా వైఫల్యం, అంతర్గత వర్గపోరుతో వివాదాల్లో నిలిచిన భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ)పై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు తీసుకుంది. టీటీఎఫ్‌ఐకి ఉన్న జాతీయ క్రీడా సమాఖ్య గుర్తింపును రద్దు చేసినట్టు బుధవారం ప్రకటించింది.
- అడ్హాక్ కమిటీ ఏర్పాటుకు ఆదేశం
న్యూఢిల్లీ : పరిపాలనా వైఫల్యం, అంతర్గత వర్గపోరుతో వివాదాల్లో నిలిచిన భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ)పై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు తీసుకుంది. టీటీఎఫ్‌ఐకి ఉన్న జాతీయ క్రీడా సమాఖ్య గుర్తింపును రద్దు చేసినట్టు బుధవారం ప్రకటించింది. సమాఖ్య రోజువారీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు, ఆసియా గేమ్స్ ముంగిట ఆటగాళ్లకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్)తో సంప్రదించి వెంటనే ఓ అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేయాలని భారత ఒలింపిక్ సంఘాన్ని (ఐఓఏ) ఆదేశించింది.
సమయానికి ఎన్నికలు నిర్వహించకపోవడం, జాతీయ పోటీల నిర్వహణలో ఆలస్యం చేయడం, పారదర్శకత లోపించడంతోనే సమాఖ్యపై వేటు వేసినట్టు క్రీడా శాఖ స్పష్టం చేసింది. గత కొన్ని నెలలుగా టీటీఎఫ్ఐ అధ్యక్షురాలు మేఘనా అహ్లావత్, ప్రధాన కార్యదర్శి కమలేష్ మెహతా మధ్య తీవ్ర ఆధిపత్య పోరు సాగుతోంది. కమలేష్‌ను ఫెడరేషన్ సస్పెండ్ చేయగా.. కోర్టు ఈ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో తమ షోకాజ్ నోటీసుకు టీటీఎఫ్ఐ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని దాని గుర్తింపు రద్దు చేస్తూ క్రీడా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

