తెలుగు యూనివర్సిటీ, జనవరి 8: సామూహిక ఆత్మీయ సమావేశాలు సామాజిక వర్గం ఆభివృద్ధికి దోహదపడుతాయని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. రెడ్డి బిజినెస్ నెట్వర్క్ సంస్థ వ్యవస్థాపకులు కేవీ రెడ్డి ఆధ్వర్యంలో రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీ భవన్లో రెడ్డి వ్యాపారస్తుల ఆత్మీయ సమ్మేళనం ఘ నంగా జరిగింది. మార్చి 25, 26, 27వ తేదీలలో ఎల్బీనగర్ కేబీఆర్ ఫంక్షన్ హాలులో జరగనున్న రెడ్డీస్ బిజినెస్ ఎక్స్పో పోస్టర్‌ను జితేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత నేత రాఘవరెడ్డి, సోషల్ మీడియా ఇన్చార్జి నాగార్జునరెడ్డి, క్రెడాయ్ మాజీ చైర్మన్ రామిరెడ్డి, మాజీ పోలీస్ అధికారి రామ నర్సింహారెడ్డి, మోటివేటర్ నర్సింహారెడ్డి, ల్యాండ్ మార్క్ గ్రూప్ అధినేత రవీందర్‌రెడ్డి, కార్యక్రమ ఇన్చార్జి సంజీవరెడ్డి, ఎక్స్ పో ఇన్చార్జి అభినయరెడ్డి పాల్గొన్నారు.