Spider-Man: Across The Spider-Verse | సూపర్ హీరో సినిమాలు అంటే చాలు ఇండియన్స్‌కు ముందుగా గుర్తొచ్చే పేరు స్పైడర్ మ్యాన్ (Spider Man). యానిమెటెడ్ అయినా లైవ్ యాక్షన్ సినిమాలు అయినా స్పైడర్ మ్యాన్ సిరీస్ నుంచి సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ ఎగబడిపోతుంటారు. అయితే ఈ ఫ్రాంచైజ్ నుంచి తాజాగా వచ్చిన యానిమెటెడ్ చిత్రం స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్ (Spider-Man: Across The Spider-Verse).
ఈ సినిమా 2018లో వచ్చిన ‘స్పైడర్‌మ్యాన్: ఇన్‌టూ ది స్పైడర్‌వర్స్(Spider into the Spider verse)’ అనే మూవీకి సీక్వెల్‌గా వచ్చింది. ఈ యేడాది జూన్ 01న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టుకుంది. ఇక ఈ చిత్రంలో ఇండియన్ స్పైడర్ మ్యాన్‌గా పవిత్ర ప్రభాకర్ (Pavitra Prabhakar) అనే పాత్ర ఉండగా.. ఈ రోల్‌కు టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ డబ్బింగ్ చెప్పాడు. కాగా తాజాగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
Spider-Man: Across The Spider-Verse is now available for purchase on Prime Video. 🕸️@SpiderVerse pic.twitter.com/svmvPCv79Z
— Prime Video (@PrimeVideo) August 8, 2023
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్‌లో స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్ సినిమా రెంటల్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. సోనీ పిక్చర్స్ ఎంటర్టైనమెంట్ మోషన్ పిక్చర్ గ్రూప్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి జోక్విమ్ డాస్ శాంటోస్, జస్టిన్ కె. థాంప్సన్, కెంప్ పవర్స్ దర్శకత్వం వహించారు.