న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ విమానంలో ఆటోపైలట్ సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ నుంచి నాసిక్ వెళ్లాల్సిన విమానం.. మధ్యలోనే మళ్లీ వెనక్కి వచ్చేసింది. ఆటోపైలట్ లోపం వల్ల ఇలా జరిగినట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. బోయింగ్ 737 విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు అధికారులు చెప్పారు. ఢిల్లీ నుంచి నాసిక్ బయలుదేరిన స్పైస్‌జెట్ బీ737 విమానంలో గురువారం ఆటోపైలట్ సమస్య వచ్చిందని, దాని వల్ల ఆ విమానాన్ని మధ్యలోనే దారి మళ్లించినట్లు చెప్పారు. ఆటోపైలట్ సిస్టమ్‌లో లోపం తలెత్తడం వల్ల విమానాన్ని సిబ్బంది వెనక్కి తీసుకువచ్చినట్లు స్పైస్‌జెట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండింగ్ నార్మల్‌గా జరిగిందని, ప్రయాణికులు సురక్షితంగా బయటకు వచ్చినట్లు స్పైస్‌జెట్ చెప్పింది. ఇటీవల స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న విషయం తెలిసిందే.