లక్నో: వేగంగా వెళ్లిన స్కార్పియో వాహనం అదుపుతప్పి రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈ క్రమంలో బెలూన్లు అమ్మే వ్యక్తిపైకి అది దూసుకెళ్లడంతో అక్కడికక్కడే అతడు మరణించాడు. (Scorpio runs over balloon seller) ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 23న రాత్రి వేళ స్కార్పియోను డ్రైవర్ వేగంగా నడిపాడు. దీంతో అది అదుపుతప్పింది. రోడ్డు డివైడర్ను ఢీకొట్టి రెండుసార్లు పల్టీలు కొట్టింది. ఆ సమయంలో అక్కడున్న బూరలు అమ్మే వ్యక్తిపైకి స్కార్పియో దూసుకెళ్లగా అతడు చనిపోయాడు.
కాగా, ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్యూవీ వాహనంలో పలు మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బెలూన్లు అమ్మే మృతుడ్ని స్థానిక రైల్వే కాలనీకి చెందిన భానుగా గుర్తించారు. వాహనం డ్రైవర్ సహా అందులో ఉన్న ఐదుగురు వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
In UP’s Meerut, a poor balloon vendor Bhanu, 50, was killed after he was mowed down by a speeding SUV with occupants allegedly under influence of alcohol. Police registered a case under unidentified depsite an accused handed over to police by onlookers. Others escaped. pic.twitter.com/axRIoxVNhW
— Piyush Rai (@Benarasiyaa) October 25, 2023