రియల్ హీరో సోనూసూద్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ సెలబ్రెటీలు కూడా ఆయనకు విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆచార్య టీం కూడా సోనూకు శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాకుండా ఆచార్య సినిమాలోని ఆయన లుక్‌ను రిలీజ్ చేసింది. నుదుట బొట్టు పెట్టుకుని పిలకతో సోనూసూద్ లుక్ కొత్తగా ఉంది. చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఆచార్య సినిమాలో రామ్‌చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్, రామ్ చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Team #Acharya wishes the versatile actor & man with a golden heart @SonuSood a very Happy Birthday.
— Konidela Pro Company (@KonidelaPro) July 30, 2021
Megastar @KChiruTweets @AlwaysRamCharan @sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma @DOP_Tirru @NavinNooli @sureshsrajan #NiranjanReddy @MatineeEnt @KonidelaPro pic.twitter.com/sVTeANJKh0
ఒకవైపు సామాజిక సేవ చేస్తూనే.. మరోవైపు సినిమాలతో బిజీగా గడిపేస్తున్నాడు సోనూ సూద్. చిరంజీవి ఆచార్య సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాల్లో సోనూ నటిస్తున్నాడు. తమిళ చిత్రం తమిళరసన్, హిందీ సినిమా పృథ్వీరాజ్లోనూ ఆయన నటిస్తున్నాడు. ప్రస్తుతం సోనూసూద్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయన్ను హీరోగా సినిమాలు చేసేందుకు కూడా ట్రై చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Sumanth Malli Modalaindi | సుమంత్ ‘మళ్లీ మొదలైంది’ ఫస్ట్ లుక్
Review : తిమ్మరుసు సినిమా ఎలా ఉందంటే..
రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సుమంత్.. దేవుడు, దెయ్యాలకు థ్యాంక్స్ చెప్పిన ఆర్జీవీ
సిల్క్ స్మితను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు