శ్రీనగర్: బాలీవుడ్ హిట్ చిత్రం ‘3 ఇడియట్స్’కు స్ఫూరిగా నిలిచిన సోనమ్ వాంగ్‌చుక్ తన స్వస్థలమైన లఢక్‌లో ప్రస్తుతం పరిస్థితులేమీ బాగాలేవని పేర్కొన్నారు. సున్నితమైన పర్యావరణాన్ని కలిగివున్న లఢక్‌లో మైనింగ్, ఇతర వ్యాపార కార్యకలాపాలను విస్తరించడం సరికాదని తెలిపారు. ఇలాంటి కార్యకలాపాల వల్ల హిమనీనదాలు కరిగిపోతాయని, జల వనరులు సహా ఇతర సహజర వనరులకు పెను ముప్పు ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ‘ఆల్ ఈజ్ నాట్ వెల్ విత్ లఢక్’ (లఢక్‌లో పరిస్థితులేమీ బాగాలేవు) అంటూ ప్రధాని నరేంద్రమోదీకి ఓ వీడియో సందేశాన్ని పంపారు. లఢక్‌ను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలని ఆ వీడియోలో డిమాండ్ చేశారు.