
హైదరాబాద్, డిసెంబర్ 6: ఒకవైపు వాహన విక్రయాలు అంతకంతకు తగ్గుతుంటే..మరోవైపు ట్రాక్టర్ విక్రయాలు ఊపందుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకుంటుండటంతో సోనాలిక ట్రాక్టర్లకు అనూహ్యంగా డిమాండ్ నెలకొన్నది. గత నెలలో 11,909 యూనిట్ల విక్రయాలు జరిపింది. మరోవైపు కంపెనీ 22,268 యూనిట్లను ఎగుమతి చేసింది.