హైదరాబాద్, ఆట ప్రతినిధి : హైదరాబాద్కు చెందిన టేబుల్ టెన్నిస్ కోచ్ సోమనాథ్ ఘోష్ భారత టీటీ జట్టుకు కోచ్గా ఎంపికయ్యాడు. మార్చి 30-ఏప్రిల్ 5 వరకు మకావులో జరుగుతున్న ఐటీటీఎఫ్ మెన్స్ అండ్ ఉమెన్స్ వరల్డ్ కప్ సందర్భంగా సోమ్నాథ్.. భారత టీటీ జట్టుకు కోచ్గా వ్యవహరించనున్నాడు.
ఈ టోర్నీతో పాటు వచ్చే నెల 28 నుంచి మే 10వ తారీఖు వరకు లండన్లో నిర్వహించనున్న వందో ఐటీటీఎఫ్ వరల్డ్ టీమ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్నకూ కోచ్గా నియమితుడయ్యాడు.