చెన్నై: టీవీకే చీఫ్ విజయ్ తనకు రూ.603 కోట్ల స్థిర,చరాస్తులు ఉన్నట్టు సోమవారం ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. తనకు రూ.404.58 కోట్ల చరాస్తులున్నాయని విజయ్ తెలిపారు. కొడైకెనాల్లోని వ్యవసాయ భూమి, చెన్నైవ్యాప్తంగా ఉన్న వాణిజ్య, నివాస భవనాలతో కూడిన చరాస్తుల విలువ రూ.198.62 కోట్లుగా ఉంది.
తన భార్య సంగీత పేరిట రూ.15.76 కోట్లు విలువజేసే ఆస్తులున్నట్టు విజ య్ ప్రకటించారు. వ్యక్తిగతంగా తన వద్ద రూ.2 లక్షల నగదు, వివిధ బ్యా ంకు ఖాతాల్లో రూ.213 కోట్లకుపైగా డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు.