మియామి : ఇటలీ సంచలనం యానిక్ సిన్నర్ కూడా టాప్ సీడ్ అరీనా సబలెంకా బాటలోనే పయనించి ‘సన్‌షైన్ డబుల్’ సాధించాడు. ఇటీవలే ముగిసిన ఇండియన్ వెల్స్ టైటిల్ నెగ్గిన రెండో సీడ్ సిన్నర్.. తాజాగా ఆదివారం రాత్రి ముగిసిన మియామి ఓపెన్‌లోనూ సత్తాచాటి విజేతగా నిలిచాడు. ఫైనల్లో సిన్నర్.. 6-4, 6-4తో జిరి లెహెకా (చెక్)పై సునాయసంగా నెగ్గాడు.
ఒకే సీజన్లో ఇండియన్ వెల్స్, మియామి ఓపెన్ గెలిచినవారికి సన్‌షైన్ డబుల్ గుర్తింపు దక్కుతుంది. రెండ్రోజుల క్రితం సబలెంకా ఈ ఘనత సాధించగా మెన్స్ సింగిల్స్‌లో ఆ గుర్తింపు సిన్నర్‌కు దక్కింది. పురుషుల సింగిల్స్‌లో రోజర్ ఫెదరర్ (2017లో) తర్వాత ఈ రికార్డు సాధించిన తొలి ప్లేయర్‌గా సిన్నర్ నిలిచాడు. ఈ టోర్నీలో ఒక్క సెట్ కూడా ఓడిపోకుండా సిన్నర్ టైటిల్ నెగ్గడం విశేషం.