Sobhita | నాగచైతన్యతో వివాహం అనంతరం మళ్లీ తెలుగులో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న నటి శోభిత ధూళిపాళ్ల. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘చీకటిలో’ జనవరి 23న ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదల కానుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్కు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ‘చీకటిలో’ సినిమాలో శోభిత ధూళిపాళ, విశ్వదేవ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించారు. థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో రిలేషన్షిప్ యాంగిల్ కీలకంగా ఉండటం విశేషం. పాత్రల మధ్య భావోద్వేగాలు, విభేదాలు, మానసిక సంఘర్షణలను రియలిస్టిక్‌గా చూపించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శోభిత, ‘చీకటిలో’ కథలోని రిలేషన్షిప్ కోణం తనకు ఎంతో నచ్చిందని చెప్పింది. “రియల్ లైఫ్‌లో ఏ ఇద్దరు భాగస్వాములు ఎప్పుడూ ఒకే ఆలోచనతో ఉండరు. రిలేషన్లో గొడవలు, విభేదాలు సహజం. అదే నిజాన్ని మా పాత్రల ద్వారా ఈ సినిమాలో చూపించాం. చాలా కాలం తర్వాత నేను డైరెక్ట్ తెలుగులో నటిస్తున్నాను. ‘చీకటిలో’లో నా పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని నమ్మకం ఉంది,” అని శోభిత తెలిపింది. “రియల్ రిలేషన్షిప్స్లో గొడవలు సహజమే” అన్న శోభిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు “నిజమే కదా”, “మెచ్యూర్ థాట్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆమె వ్యక్తిగత జీవితంతో ఈ వ్యాఖ్యలను లింక్ చేస్తూ చర్చలు కూడా చేస్తున్నారు.
శోభిత ధూళిపాళ 2024 డిసెంబర్లో నాగచైతన్యను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత వీరిద్దరూ మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో ఈ జంట కలిసి కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. పెళ్లి తర్వాత శోభిత నుంచి వస్తున్న తొలి తెలుగు రిలీజ్ కావడంతో ‘చీకటిలో’పై ప్రత్యేక ఆసక్తి ఉంది. థ్రిల్లర్ కథాంశం, రిలేషన్షిప్ రియాలిటీ, శోభిత–విశ్వదేవ్ పెర్ఫార్మెన్సెస్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. జనవరి 23న ఓటీటీలో ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.