Skyroot Aerospace | భారతీయ స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ చరిత్ర సృష్టించింది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తన విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.
నిజానికి విక్రమ్-1 రాకెట్ ప్రయోగం 11.35 గంటలకు జరగాల్సి ఉంది. కానీ ఇంధన సమస్యలు తలెత్తడంతో తాత్కాలికంగా ప్రయోగాన్ని నిలిపివేశారు. సమస్యలను శాస్త్రవేత్తలు పరిష్కరించిన అనంతరం మధ్యాహ్నం 12.05 గంటలకు మరోసారి రాకెట్‌ను ప్రయోగించారు.
విక్రమ్-1 అనేది పూర్తిగా నాలుగు దశల ఆర్బిటల్ లాంచ్ వెహికల్. మొదటి మూడు దశలు సాలిడ్ ప్రొపల్షన్‌ను ఉపయోగిస్తాయి. నాలుగో దశ ఆర్బిటల్ ఇన్సర్షన్, ప్రిసిషన్ విన్యాసాల కోసం లిక్విడ్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. 350 కిలోల వరకు బరువు ఉన్న చిన్న ఉపగ్రహాలను ఎర్త్ ఆర్బిట్‌కి తీసుకెళ్లడానికి దీనిని నిర్మించారు. దీని మొదటి టెస్ట్ ఫ్లైట్ 60 డిగ్రీల వాలులో 450 కిలోమీటర్ల కక్ష్యను చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. విక్రమ్-1 భారతీయ ఎర్త్ అబ్జర్వేషన్ నానోశాటిలైట్ మేకర్ గ్రహ స్పేస్, తదితర సంస్థల నుంచి బహుళ సాంకేతిక ప్రదర్శన పేలోడ్లను తీసుకెళ్లనుంది.