Ajith Kumar | అబుదాబీలోని యాస్ మెరీనా సర్క్యూట్లో జరుగుతున్న ‘యాస్ స్పీడ్ ఫెస్టివల్’లో ప్రముఖ నటుడు రేసర్ అజిత్ కుమార్‌ను నటుడు శివకార్తికేయన్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నాడు. అజిత్‌తో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ శివకార్తికేయన్ స్పెషల్ పోస్ట్ పెట్టాడు. “నిజమైన ప్యాషన్, అంకితభావం, పట్టుదలను ప్రత్యక్షంగా చూశాను. ఒక గొప్ప వ్యక్తితో గడిపిన ఈ రోజు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. ఎప్పటికీ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటాను ఏకే సార్” అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు. ఈ ఫోటోల్లో శివకార్తికేయన్ ‘అజిత్ కుమార్ రేసింగ్’ జెర్సీ ధరించి కనిపించడం విశేషం. వీరిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్న వీడియోలు, ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అజిత్ తన రేసింగ్ టీమ్‌తో అంతర్జాతీయ రేసుల్లో బిజీగా ఉండగా, ఇటీవలే పరాశక్తి సినిమాతో విజయాన్ని అందుకున్న శివకార్తికేయన్ ఆయనకు మద్దతు తెలపడానికి వెళ్లారు. ఇక శివకార్తికేయన్ నటించిన ‘పరాశక్తి’ మూవీ సంక్రాంతికి విడుదలై రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా ఫిబ్రవరి 7 నుంచి ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
Pure passion, commitment, dedication and resilience – experienced it live, felt the adrenaline rush.
An inspiring day spent with an inspiring person. Always look up to you, my dear #AK sir 🙏🙏❤️❤️🤗🤗 pic.twitter.com/HqKmW9Cv03
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) February 7, 2026