Ayalaan | కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) కాంపౌండ్ నుంచి వస్తోన్న సినిమాల్లో ఒకటి అయలాన్ (Ayalaan). ఆర్ రవికుమార్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన అయలాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరో సినిమాతో పోటీ పడబోతుందన్న వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఇంతకీ ఆ సినిమా ఏంటనే కదా మీ డౌటు. స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటిస్తున్న తంగలాన్ (Thangalaan). తమిళ్ అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని 2024 ప్రథమార్థంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే నెట్టింట వార్తలు షికారు చేస్తున్నాయి. తంగలాన్ గ్లింప్స్ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. తాజాగా నెట్టింట వస్తున్న కథనాల ప్రకారం అయలాన్, తంగలాన్ 2024 పొంగళ్ కానుకగా విడుదల కానున్నాయని ఓ వార్త హల్ చల్ చేస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వస్తే క్లారిటీ రానుంది.
తంగలాన్ 2డీ, 3డీ ఫార్మాట్లలో కూడా విడుదల కానుంది. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, పార్వతి తిరువొత్తు ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. అయలాన్ లుక్లో శివకార్తికేయన్ గగనంలో విహరిస్తుండగా.. అతడితోపాటే ఏలియన్ కూడా వెళ్తున్న పోస్టర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. అయలాన్ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీలో శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్, బాల శరవణన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
తంగలాన్ మేకింగ్ గ్లింప్స్ వీడియో..
Get ready for the visitor from Outer space 👽#Ayalaan is coming to you all this Diwali#AyalaanFromDiwali2023@Siva_Kartikeyan @arrahman @Ravikumar_Dir @kjr_studios @24amstudios @ishakonnects @SharadK7 @iYogiBabu #Karunakaran #Niravshah @AntonyLRuben @muthurajthangvl… pic.twitter.com/YxJ7LdSVTy
— Rakul Singh (@Rakulpreet) April 24, 2023