సిరిసిల్ల టౌన్ ; భద్రాద్రి సీతమ్మ కోసం సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ తయారుచేసిన బంగారు చీర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ఆరు రోజుల పాటు శ్రమించి.. రెండు గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి, పట్టుదారాలను వినియోగించి.. మరమగ్గంపై ఈ చీరను తయారు చేశారు. చీర బరువు 800 గ్రాములు ఉంటుందని చెప్పారు.