హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : ప్రతి రోజు 12.1లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను తొలగించాలని సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి అన్ని ఏరియాల జీఎంలను ఆదేశించారు. 15 ఓపెన్కాస్టుల్లో తొలగింపు పనులపై సీఎండీ శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సంస్థ డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కే వెంకటేశ్వర్లు, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.