ఇమోలా: ఎమిలియా-రోమాగ్న ఫార్ములావన్ గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ స్టార్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ పోల్ పొజిషన్ దక్కించుకున్నాడు. శనివారం జరిగిన సన్నాహక రేసులో వెర్స్టాపెన్ టాప్‌లో నిలిచాడు. ప్రత్యర్థి రేసర్లకు దీటైన సవాల్ విసురుతూ ఈ బెల్జియం యువ రేసర్ మరో టైటిల్ దక్కించుకునేందుకు తహతహలాడుతున్నాడు. లెక్రెక్(ఫెరారీ), పెరెజ్(రెడ్‌బుల్) వరుసగా రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నారు. ఆదివారం ప్రధాన రేసు జరుగనుంది.