హైదరాబాద్, జూన్ 8: సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మరో అతిపెద్ద ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది. ఉత్తర అమెరికా నుంచి రూ.208 కోట్ల విలువైన ఆర్డర్ లభించింది. ఈ ఆర్డర్లో భాగంగా 40 వేల యూనిట్ల 155 ఎంఎం ఎం107 ఫిరంగి గుండ్లను సరఫరా చేయాల్సివుంటుందని పేర్కొంది.
అంతర్జాతీయ డిఫెన్స్ తయారీ రంగంలో తనదైన ముద్ర వేసిన సంస్థకు ఇది అతిపెద్ద ఆర్డర్లలో ఒకటని కంపెనీ సీఈవో, ఈడీ సునీల్ కలిదిండి తెలిపారు. ఈ కాంట్రాక్ట్‌ను వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేయాల్సివుంటుందన్నారు.