Siddu Jonnalagadda | ‘డీజే టిల్లు’(DJ Tillu) చిత్రంలో హీరోగా తన నటనతో, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్న కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమాతో సిద్దూకు యూత్‌లో మాములు క్రేజ్ రాలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. ఇక ఇదిలా ఉంటే సిద్దూ తన తదుపరి సినిమాను అనౌన్స్ చేశాడు.
తనకు ఆరెంజ్ సినిమాలో క్యారెక్టర్ రోల్ ఇచ్చిన దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌తో సిద్దూ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్ గురువారం అట్టహాసంగా జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభంకాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చి.. సినిమా ఓపెనింగ్ చేశారు.
ఇక ఈ సినిమాకు హ్యారిస్ జయరాజ్ స్వరాలు సమకూర్చుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. ఈ కార్యక్రమానికి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, దర్శకురాలు నందిని రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
Grand Opening Clicks 📸📸 From Star Boy @siddu_buoy @baskifilmz @SVCCofficial pic.twitter.com/uCO0Ks7KXs
— BA Raju’s Team (@baraju_SuperHit) August 10, 2023