హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ అధికారులు వెల్లడించారు. మంగళవారం నల్లగొండ జిల్లాలో 39.3 డిగ్రీలు, నారాయణపేట, ములుగు జిల్లాల్లో 38.7 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జనగామ జిల్లా మినహా అన్ని జిల్లాల్లో 35 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు తెలిపారు.
మరో ఐదు రోజులపాటు ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగే పరిస్థితులున్నాయని వెల్లడించారు. మరోవైపు ఉపరితల ఆవర్తనం,ద్రోణి ప్రభా వం కొనసాగుతున్నది. మూడు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశాలున్నాయి.