‘కోరమీసం, వంకీలు తిరిగిన జుట్టుతో అలనాటి బెంగాలీ వేషధారణలో కనిపిస్తున్న ఈ యువకుడి పూర్తి పేరు శ్యామ్‌సింగరాయ్. అందరూ శ్యామ్ అని పిలిచే అతడి కథేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు నాని. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘శ్యామ్‌సింగరాయ్. రాహుల్ సాంకృత్యాన్ దర్శకుడు. వెంకట్ బోయనపల్లి నిర్మాత. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ కథానాయికలు. నాని పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్ విడుదలచేశారు. ఇందులో బెంగాళీ యువకుడిగా నాని కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న చిత్రమిది. ప్రస్తుతం కోల్‌కతాలో చిత్రీకరణ జరుగుతోంది.