కమల్ గారాల పట్టి శృతి హాసన్ ఈ మధ్య నిత్యం వార్తలలో నిలుస్తూ వస్తుంది. ఇటు సినిమాలు లేదంటే అటు బాయ్ ఫ్రెండ్స్‌కి సంబంధించిన విషయాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ ఏడాది క్రాక్, వకీల్ సాబ్ చిత్రాలతో మంచి హిట్స్ కొట్టిన శృతి ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.
ఆ మధ్య మైఖేల్ కోర్సలేతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన శృతి హాసన్ ఆ సమయంలో సినిమాలు చేయడమే మానేసింది. అతనికి బ్రేకప్ చెప్పాక మళ్లీ సినిమాలు చేస్తుంది. ఇక ఇప్పుడు శాంతను హజారికతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ ఆశ్చర్యపరుస్తుంది.
లాక్ డౌన్ సమయంలో…వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. రీసెంట్గా బాయ్ ఫ్రెండ్‌తో కలిసి చికెన్‌తో తయారు చేసిన వంటకాలను తింటూ వీడియో షేర్ చేసింది. ఫ్రై చికెన్ అంటూ సాంగ్ పాడుకుంటూ..ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. తాజాగా సూపర్ మార్కెట్లో శాంతనుతో కలిసి తెగ రచ్చ చేయగా, ఆ పొటోలను షేర్ చేసింది. ఓ ఫోటోలో ఇద్దరు మాస్క్‌లు పెట్టుకొని ఉండగా, శృతి..శాంతను బుగ్గపై ముద్దు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. ఈ పిక్స్‌పై నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ పెడుతున్నారు.