Rajat Patidar : టీ20ల్లో తిరుగులేని శక్తిగా ఉన్న భారత జట్టు ఇప్పుడు వరసగా ఓడిపోతోంది. కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) నిర్ణయాలు బెడిసికొడుతుండగా ఐర్లాండ్ చేతిలో మొదటిసారి వైట్‌వాష్..ఆపై ఇంగ్లండ్ గడ్డపై ఓటమి. టీమిండియా సారథిగా తొలి విజయం కోసం అయ్యర్ నిరీక్షిస్తుండగా.. నెట్టింట రజత్ పటిదార్ పేరు (Rajat Patidar) మార్మోగిపోతోంది. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును వరసగా రెండు సీజన్లలో ఛాంపియన్‌గా నిలిపిన పటిదార్‌కు అన్యాయం జరిగిందని పలువురు పోస్టులు పెడుతున్నారు.
ఐపీఎల్లో విజయవంతమైన శ్రేయాస్ అయ్యర్ టీమిండియా టీ20 సారథిగా మాత్రం తేలిపోతున్నాడు. జట్టు కూర్పు నుంచి మైదానంలో వ్యూహాలు పన్నడంలోనూ అయ్యర్ విఫలమవ్వడం చూస్తున్నాం. అందుకు మొదటి సిరీస్‌లోనే 2-0తో ఐర్లాండ్ క్లీన్‌స్వీప్ చేయడం అయ్యర్ కెప్టెన్సీలో మాయని మచ్చే. ఈ ఓటమి నుంచి తేరుకుందానుకుంటే ఇంగ్లండ్‌పైనా పరాజయమే పలకరించింది.
Can anyone tell me why Rajat Patidar is not in Team India ??pic.twitter.com/xhnjoIs24E
— Honest Cricket Lover (@Honest_Cric_fan) July 4, 2026
🚨 More than Bishnoi, batting order struggles completely and you’re 30 run short.
Yet Rajat Patidar cannot even get a spot on the bench for the England T20I series?
True definition of a system fraud. The agenda against him/RCB player is unreal. 😤 pic.twitter.com/R7KKw3UKc2
— A N U J (@Hello_anuj) July 5, 2026
ఓపెనర్ అభిషేక్ శర్మ నుంచి లోయర్ ఆర్డర్లో అర్ష్‌దీప్ సింగ్ వరకూ .. బ్యాటింగ్ ఆర్డర్లో ఏకంగా ఆరుగురు లెఫ్ట్ హ్యాండర్లే ఉండడం వ్యూహాత్మక తప్పిదమని విశ్లేషకులు చెబుతున్నారు. ఐపీఎల్ తరహాలో టీమిండియాను గెలుపు తోవ తొక్కించలేకపోతున్న అయ్యర్‌పై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో ఆర్సీబీ ట్రోఫీ కలను సాకారం చేసిన రజత్ పాటిదార్‌కు బీసీసీఐ అన్యాయం చేసిందని పలువులురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం పటిదార్‌కు మద్దతు పలికాడు.
INDIA MUST GIVE RAJAT PATIDAR A CHANCE – IRFAN PATHAN🤯
Irfan Pathan said :🗣️
“There are so many left handed batters in this Indian batting line up. When you have an IPL winning captain with two titles back to back for RCB & his batting form was stupendous as well. You should… pic.twitter.com/crVylts9cb
— Akshat (@Akshatgoel1408) July 5, 2026
‘ప్రస్తుతం భారత జట్టు బ్యాటింగ్ లైనప్‌లో ఆరుగురు ఎడమ చేతివాటం ఆటగాళ్లు ఉన్నారు. ఐపీఎల్లో వరసగా రెండు ట్రోఫీలు గెలుపొందిన కెప్టెన్ రజత్ పటిదార్ ఉండగా అతడిని ఎందుకు ఎంపిక చేయలేదు. పైగా అతడు భీకర ఫామ్‌లో ఉన్నాడు. పటిదార్‌కు త్వరలోనే అవకాశం వస్తుందుని నేను ఆశిస్తున్నా. ఎందుకుంటే.. వచ్చే పొట్టి ప్రపంచకప్ కోసం ప్రయోగాలు చేసేందుకు టీమిండియాకు చాలా సమయం ఉంది’ అని ఇర్ఫాన్ పేర్కొన్నాడు.