Bail Movie | కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్‌కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కర్ణాటకలోని చిత్రదుర్గంలో ఆయన నటించిన కొత్త చిత్రం ‘బెయిల్’ ప్రమోషన్స్‌లో భాగంగా బసవేశ్వర థియేటర్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
థియేటర్లోకి ప్రవేశిస్తున్న సమయంలో అభిమానులు కాల్చిన టపాకాయ ఒకటి ఆయనకు అత్యంత సమీపంలో పేలడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఊహించని పరిణామానికి భయపడిన శివరాజ్ కుమార్ వెంటనే తన ముఖాన్ని, తలను చేతులతో కవర్ చేసుకున్నారు. ఆయన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయనను రక్షించారు. కొద్దిసేపు ఆందోళనకర వాతావరణం నెలకొన్నప్పటికీ, ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఆయన తేరుకుని ప్రశాంతంగా అభిమానులను పలకరించారు, థియేటర్ సిబ్బందితో మాట్లాడారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, వేదిక వద్ద సరైన ఏర్పాట్లు చేయకపోవడం పట్ల నిర్వాహకులపై మండిపడ్డారు. గతేడాది క్యాన్సర్ చికిత్స నుంచి కోలుకుని తిరిగి షూటింగ్స్‌లో పాల్గొంటున్న శివరాజ్ కుమార్, ప్రస్తుతం ‘బెయిల్’ చిత్రంతో పాటు తమిళంలో ‘జైలర్ 2’ వంటి పలు క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు.
actor shivarajkumar escape Firecracker accident at chitradurga #shivarajkumar #jailer2 #bail #chitradurga #shivanna #chitradurga #KarnatakaNews pic.twitter.com/qxX4kiZ39Q
— Santosh Kumar (@Santhuka820) October 6, 2026