Aaya Sher | నేచురల్ స్టార్ నాని హీరోగా, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే పాటలు, మాస్ ఎలివేషన్స్‌తో ‘ది ప్యారడైజ్’ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.ఇక ఈ చిత్రానికి సంబంధించిన తొలి పాట ‘ఆయా షేర్’ ఇప్పటికే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుంది యూట్యూబ్‌తో పాటు డిజిటల్ వేదికలపై కూడా ఈ సాంగ్ అనేక రికార్డులు సాధించింది. దీంతో పాటు ‘ది ప్యారడైజ్’ మ్యూజికల్ ప్రమోషన్స్‌లో ఈ పాట కీలకంగా మారింది. తాజాగా ఈ పాటకి సంబంధించిన ఫుల్ వీడియో విడుదల చేశారు. ఈ పాటలోని నాని సిగ్నేచర్ స్టెప్పులకి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.
‘ఆయా షేర్’ పాటకు అనిరుధ్ రవిచందర్ అందించిన హై-వోల్టేజ్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కాసర్ల శ్యామ్ రాసిన ఎనర్జిటిక్ సాహిత్యానికి అద్దుల జంగిరెడ్డి, అర్జున్ చాందీ తమదైన శైలిలో గాత్రాన్ని అందించారు. పాటలోని క్యాచీ ట్యూన్, పవర్ఫుల్ బీట్స్, మాస్ కొరియోగ్రఫీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.యూత్, కాలేజీ విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఈ పాటకు మంచి క్రేజ్ ఏర్పడింది. సోషల్ మీడియా రీల్స్ నుంచి పబ్లిక్ ఈవెంట్స్, వేడుకల వరకు ‘ఆయా షేర్’ సందడి కనిపించింది. ముఖ్యంగా పాటలోని బీట్స్, హుక్ స్టెప్పులు అభిమానులను ఆకట్టుకోవడంతో ఇది సెలబ్రేషన్ సాంగ్‌గా మారిపోయింది.
‘దసరా’ వంటి ఊరమాస్ విజయాన్ని అందించిన శ్రీకాంత్ ఓదెల.. ‘ది ప్యారడైజ్’లో నానిని మరింత రగ్గడ్, పవర్ఫుల్ పాత్రలో చూపించారు. నాని లుక్, బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఇప్పటివరకు కనిపించని విధంగా నాని కొత్త అవతార్‌లో కనిపించడం సినిమాపై అంచనాలు మరింత పెంచింది. కాయాదు లోహర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయల్, బాబు మోహన్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో నటించారు.