Sharwanand | థియేటర్లో తెరకు నమస్కారం చేసిన శర్వానంద్.. ‘బైకర్’ సక్సెస్‌తో ఫుల్ ఎమోషన్
Sharwanand | టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస విజయాలతో మంచి ఫామ్‌లో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఫ్యామిలీ ఎంటర్టైనర్తో సూపర్ హిట్ అందుకున్న ఆయన, తాజాగా బైకర్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మోటార్ బైక్ రేసింగ్ నేపథ్యంలో భావోద్వేగాలను మేళవిస్తూ తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది.
Sharwanand | టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస విజయాలతో మంచి ఫామ్‌లో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఫ్యామిలీ ఎంటర్టైనర్తో సూపర్ హిట్ అందుకున్న ఆయన, తాజాగా బైకర్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మోటార్ బైక్ రేసింగ్ నేపథ్యంలో భావోద్వేగాలను మేళవిస్తూ తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది. ముఖ్యంగా సినిమాలో డా. రాజశేఖర్ పోషించిన తండ్రి పాత్ర, శర్వానంద్‌తో ఉన్న ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను కదిలిస్తున్నాయి. ఈ సీన్స్ సినిమా హైలైట్‌గా నిలిచాయి.
ఇక ఈ సినిమాపై సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా నాగార్జున ‘బైకర్’ చిత్రాన్ని కొనియాడుతూ, కుటుంబ భావోద్వేగాలను ఎంతో అందంగా చూపించారని, రేసింగ్ సన్నివేశాలు, క్లైమాక్స్ అద్భుతంగా ఉన్నాయని అభినందించారు . ఏప్రిల్ 3న విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో శర్వానంద్ స్వయంగా థియేటర్లను సందర్శిస్తూ ప్రేక్షకులతో కలిసి సినిమా ఆనందిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీరాములు థియేటర్ ను సందర్శించిన శర్వానంద్ చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. థియేటర్లో బిగ్ స్క్రీన్ ముందు నిలబడి, తెరను ముద్దాడి నమస్కారం చేయడంతో పాటు సాష్టాంగ ప్రణామం చేశారు.
ఈ దృశ్యాన్ని చూసిన అభిమానులు ఒక్కసారిగా హర్షధ్వానాలతో థియేటర్‌ను మారుమోగించారు. శర్వానంద్ తన సినిమాపై, ప్రేక్షకులపై ఉన్న గౌరవాన్ని ఇలా వ్యక్తం చేశాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. శర్వానంద్ ఈ ఎమోషనల్ మోమెంట్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన స్వభావం, ప్రేక్షకుల పట్ల గౌరవం మరోసారి బయటపడిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ తరువాత ‘బైకర్’తో వరుసగా రెండో హిట్ అందుకోవడంతో శర్వానంద్ కెరీర్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- biker
- movie
- Sharwanand
- tollywod
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

