George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
Sharwanand | టాలీవుడ్ హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘జార్జ్ క్రిష్’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
George Krish | టాలీవుడ్ హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘జార్జ్ క్రిష్’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచేందుకు వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్ర యూనిట్ అత్యంత భారీ సెట్లను నిర్మించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడే ఒక అద్భుతమైన షెడ్యూల్‌ను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే హీరో శర్వానంద్‌పై ఒక అదిరిపోయే ‘జార్జ్ క్రిష్’ టైటిల్ సాంగ్‌ను గ్రాండ్‌గా షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో శర్వానంద్ చాలా డిఫరెంట్‌గా జూనియర్ సైంటిస్ట్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన క్యారెక్టర్ చుట్టూ నడిచే సన్నివేశాలు, వైట్ల మార్క్ కామెడీ టైమింగ్ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయి. ఫుల్-లెంగ్త్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో ఎన్నో హిలేరియస్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని మేకర్స్ చెబుతున్నారు. ఇదిలాఉంటే, ఈ సినిమాలో శర్వానంద్ సరసన అందాల భామ మానస వారణాసి హీరోయిన్గా నటిస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ పూర్తిగా ట్రెండీగా, యూత్‌ను ఆకట్టుకునేలా వైవిధ్యమైన ఫన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుందని తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు సంగీత సంచలనం అనూప్ రూబెన్స్ అద్భుతమైన బాణీలు అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు శర్వానంద్ ఎనర్జిటిక్ యాక్టింగ్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

