టాటాలకు షాక్.. సైరస్మిస్త్రీ తాజా ఎత్తు ఇదే!!
టాటాలకు షాక్ఇ ప్పటికిప్పుడు టాటా సన్స్‌లో వాటాలను ఉపసంహరించుకోవాలని సైరస్ మిస్త్రీ సారధ్యంలోని షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నిర్ణయానికి...

న్యూఢిల్లీ: టాటా సన్స్ చైర్మన్‌గా ఉద్వాసనకు గురైనప్పటి నుంచి ఆ సంస్థ యాజమాన్యంపై మండి పడుతున్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు చెందిన సైరస్ మిస్త్రీ తాజాగా వ్యూహం మార్చారు. 2016లో టాటా సన్స్ చైర్మన్‌గా మిస్త్రీని తొలగిస్తూ టాటా సన్స్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవల సుప్రీంకోర్టు ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. అయితే, తమ సంస్థలో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వాటా విలువ కేవలం రూ.80 వేల కోట్లేనని టాటా సన్స్ వాదిస్తున్నది. అది తప్పని.. తమకు రూ.1.75 లక్షల నిధులు రావాలని ఎస్పీ గ్రూప్ వాదన
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ తొలుత ఇలా
ఇప్పటికే అప్పుల ఊబిలో చిక్కుకున్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ (ఎస్పీ) తమ భవిష్యత్ బిజినెస్ ప్రయోజనాలను కాపాడుకునేందుకు టాటా సన్స్‌లోని తమ 18.4 శాతం వాటాలను విక్రయించాలని తొలుత ప్రణాళిక రూపొందించినట్లు వినికిడి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ప్రణాళికను సైరస్ మిస్త్రీకి చెందిన ఎస్పీ గ్రూప్ పక్కనబెట్టినట్లు ఆయన సన్నిహిత వర్గాల కథనం.
ఎస్పీ గ్రూప్ ప్రతిపాదనకు ఆర్బీఐ ఓకే
తాము తీసుకున్న రుణాల మొత్తం రూ.10,900 కోట్ల రుణాలను వన్‌టైం డెట్ రీస్ట్రక్చరింగ్‌కు అనుమతించాలన్న ఎస్పీ గ్రూప్ ప్రతిపాదనకు ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ సారధ్యంలో ఆర్బీఐ నియమించిన కమిటీ ఆమోదించింది. దీంతో టాటా గ్రూప్‌లో తమ వాటాల ఉపసంహరణ నెమ్మదిగా తీసుకెళ్లాలని ఎస్పీ గ్రూప్ భావిస్తున్నట్లు సమాచారం.
బిజినెస్ పురోగతిపైనే టాటా ఫోకస్
మరోవైపు, టాటా సన్స్ సైతం ఇప్పటికిప్పుడు వాటాల కొనుగోలుకు సిద్ధంగా లేదని సమాచారం. భవిష్యత్ బిజినెస్ అవకాశాలను బలోపేతం చేయడానికి అంతర్గతంగా అవసరాలను పరిష్కరించడంపైనే టాటా సన్స్ బోర్డు శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తున్నది.
ఎస్పీ గ్రూప్‌కు అత్యంత సన్నిహితులైన లీగల్ ఎగ్జిక్యూటివ్ స్పందిస్తూ.. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వాటా క్లయిమ్‌ల అంశం తేలడానికి ఐదేండ్ల వరకు టైం పడుతుందని అంచనా వేశారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవికూడా చదవండి..
హోమ్‌లోన్‌పై వడ్డీ రేటు పెంచిన ఎస్బీఐ
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ భూమికి కరోనా
కర్ణాటక ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టులో ఊరట
మహారాష్ట్ర హోంమంత్రిపై సీబీఐ ప్రాథమిక విచారణ: హైకోర్టు
కళ్లు చెదిరే రీతిలో రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ లాంచ్.. వీడియో
తప్పు నాదే.. డీకాక్ది కాదు: ఫకర్ జమాన్
హాస్పిటల్లో చేరిన అక్షయ్ కుమార్
కొవిడ్‌తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్‌ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో
స్థిరంగా పసిడి ధర.. స్వల్పంగా తగ్గిన వెండి
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Cyrus Mistry
- Tata Sons
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

