Shah Rukh Khan | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాస్ కమర్షియల్ డైరెక్టర్ అట్లీ కలయికలో తెరకెక్కనున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాకా’ (RAKA) పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ అంచనాలను మరింత పెంచుతూ తాజాగా ఒక బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఒక పవర్ఫుల్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. అట్లీ ఇప్పటికే షారుఖ్‌తో ‘జవాన్’ వంటి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అదే చొరవతో ‘రాకా’లో ఒక కీలకమైన అతిథి పాత్ర కోసం షారుఖ్‌ను అడిగారని, అందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అల్లు అర్జున్ స్టైలిష్ యాక్షన్, అట్లీ టేకింగ్, దానికి తోడు షారుఖ్ ఖాన్ చరిష్మా తోడైతే ఈ చిత్రం గ్లోబల్ లెవల్లో రికార్డులు సృష్టించడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.