న్యూఢిల్లీ: కంగనా రనౌత్(Kangana Ranaut), చిరాగ్ పాశ్వాన్ ఆ ఇద్దరూ ఇప్పుడు ఫుల్ బిజీ అయ్యారు. పబ్లిక్ ఈవెంట్స్‌లో తరుచూ కనిపిస్తున్నారు. దీంతో కొందరు డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. ఆ ఎంపీలు ఇద్దరూ రొమాంటిక్ రిలేషన్లో ఉన్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫిల్మ్ స్టార్ , ఎంపీ కంగనా రనౌత్ క్లారిటీ ఇచ్చారు. ఆ రూమర్స్‌కు ఆమె చెక్ పెట్టారు. చిరాగ్ పాశ్వాన్ కేవలం ఫ్రెండ్ మాత్రమే అని ఆమె చెప్పారు. తమ మధ్య రొమాన్స్ లేదని కంగనా పేర్కొన్నది.
చిరాగ్ కేవలం స్నేహితుడు మాత్రమే అని, అతన్ని చూసినప్పుడు ఫ్రెండ్‌గా భావిస్తానని, మా మధ్య రొమాన్స్ లేదని, తమ మధ్య చాన్నాళ్ల పరియం ఉందని, పదేళ్ల క్రితం ఇద్దరం కలిసి సినిమా తీశామని, ఒకవేళ తమ మధ్య ప్రేమాయణం సాగి ఉంటే, మాకు పిల్లలు పుట్టేవారని కంగనా రనౌత్ పేర్కొన్నది. పాశ్వాన్‌తో తన రిలేషన్ చాన్నాళ్ల నుంచి అలాగే ఉందన్నారు. ఒకవేళ తనకు రొమాన్స్ కావాలనుకుంటే, అది జరిగేదని, కానీ అలాంటిది ఏమీ లేదని, అది కేవలం ఫ్రెండ్లీ పరిచయం మాత్రమే అని, అతను కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చాడని, అందుకే తమ మధ్య పరిచయం కాస్త చనువుగా ఉంటుందని ఆమె అన్నారు.
2011లో రిలీజైన మిలే నా మిలే హమ్ చిత్రంలో కంగనా, చిరాగ్ పాశ్వాన్ కలిసి నటించారు. తన్వీర్ ఖాన్ ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ రాజకీయాల్లో రాణించారు. కానీ కంగనా అడపాదడపా చిత్రాల్లో నటిస్తోంది. చివరిసారి ఆమె ఎమర్జెన్సీ చిత్రంలో యాక్ట్ చేశారు.
एंकर- आपकी और चिराग की खूब चर्चा होती है.
कंगना रनौत- चिराग़ सिर्फ़ दोस्त है.
एंकर- मतलब कोई रोमांस नहीं हुआ…?
कंगना रनौत- अगर चिराग संग रोमांस होता तो आज हमारे बच्चे होते. 🤦
हम दोनों ने 10 साल पहले एक फिल्म साथ की थी . हम दोनों की वाइब्स मैच होती है. pic.twitter.com/Wst7Y9FVnQ
— Priya singh (@priyarajputlive) April 16, 2026