హైదరాబాద్ సిటీబ్యూరో, మే 11(నమస్తే తెలంగాణ) : రేవంత్రెడ్డి పాలనలో ఉపాధి కరువై ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి దాపురించిందని, గిరాకీలు లేక బతకడం కష్టంగా మారిందని ఆటోడ్రైవర్ సా యిరాం ఆవేదన వ్యక్తంచేశారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే తమ సమస్యలు తీరుతాయనే నమ్మ కం ఉన్నదని చెప్పారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఆదిలాబాద్ జి ల్లా నేరేడుగొండ మండలం కుట్టి గ్రా మానికి చెందిన ఆటోడ్రైవర్ సాయి రాం.. నాలుగు రోజుల క్రితం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు చేపట్టిన సైకిల్ యాత్ర సోమవారం తెలంగాణ భవన్కు చేరింది. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణ భవన్ ఇన్చార్జి రావుల చంద్రశేఖర్, బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వేము ల మారయ్య ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా సాయిరాం మాట్లాడుతూ మళ్లీ కేసీఆర్ సీఎం అయితేనే తమ సమస్యలు తీరుతాయనే సంకల్పంతోనే ఎండలను లెక్క చేయకుండా సైకిల్ యాత్ర చేపట్టానని చెప్పారు. ‘గతంలో కేసీఆర్ ఎక్కడ సభ పెట్టినా అక్కడికి వెళ్లేవాన్ని. కేసీఆర్ పి లుపుతో ఉద్యమంలో పాల్గొన్నా. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. గిరాకీ లేక ఆటో కూడా అమ్ముకున్నా. మిగతా ఆటోడ్రైవర్ల బాధలు చూడలేక నేను సైకిల్ యాత్ర చేపట్టిన. రాష్ట్రవ్యాప్తంగా అందరూ బాధలో ఉన్నరు. అన్ని పథకాలు కనుమరుగయ్యాయి’ అని ఆవేదన వ్యక్తంచేశారు. మళ్లీ కేసీఆర్ రావాలని యిరాం ఆకాంక్షించారు. అనంతరం ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య మాట్లాడుతూ జిల్లాకేంద్రాలు, గ్రామాల్లో ఆటోలు నడుపుకొనే వారి జీవితం అస్తవ్యస్తంగా మారిందని మండిపడ్డారు. ఏడాదికి రూ.12వేలు ఇస్తామని చెప్పిన రేవంత్రెడ్డి.. ఇప్పటికీ అమలుచేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.