JD Vance : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై ఒక దుండగుడు దాడి చేశాడు. ఈ ఘటనలో ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఒహియో రాష్ట్రంలోని సిన్సినాటి నగరంలో ఉన్న ఈస్ట్ వాల్నట్ అనే జేడీ వాన్స్ ఇంటిపై దుండగుడు దాడి చేశాడు.
అయితే, ఘటన సమయంలో ఆయన, కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. దుండగుడు లోపలికి ఎలా ప్రవేశించాడు అనే అంశం పోలీసుల్ని, భద్రతా సిబ్బందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఘటన సమయంలో ఇంటి వద్ద దుండగుడిని గుర్తించిన పోలీసులు, సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
దాడి చేయడానికి గల కారణాల్ని తెలుసుకుంటున్నారు. ప్రస్తుతానికి యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కు ఎలాంటి ముప్పు లేదని వారు వెల్లడించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.