బ్రిటానియాకు షాక్: ఐటీసీపై కేసు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
బ్రిటానియాకు షాక్| మరో ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ ఐటీసీ నిబంధనలను ఉల్లంఘించి తమ లేబుళ్లను వాడుకుంటుందని బ్రిటానియా చేసిన వాదనను ఢిల్లీ హైకోర్టు..

న్యూఢిల్లీ: ప్రముఖ బ్రిటానియా ఇండస్ట్రీస్‌కు సోమవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరో ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ ఐటీసీ నిబంధనలను ఉల్లంఘించి తమ లేబుళ్లను వాడుకుంటుందని బ్రిటానియా చేసిన వాదనను ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ తోసిపుచ్చింది. బ్రిటానియా ఇండస్ట్రీస్ తమ న్యూట్రీ చాయిస్ డైజెస్టివ్ బిస్కట్స్ లేబుల్ మాదిరిగానే ఐటీసీ సన్ ఫీస్ట్ ఫార్మ్లైట్ 5-సీడ్ డైజెస్టివ్ లేబుల్ వాడుతున్నదని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించింది.
బ్రిటానియా పిటిషన్ మేరకు ఐటీసీకి వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి జస్టిస్ సీ హరిశంకర్ సారథ్యంలోని సింగిల్ బెంచ్ నిరాకరించింది. ఐటీసీ తన సన్‌ఫీస్ట్-వేద డైజెస్టివ్, 5-సీడ్ డైజెస్టివ్ బిస్కట్స్ ప్యాకెట్ల విక్రయాలను యధాతథంగా కొనసాగించొచ్చునని పేర్కొంది. దీంతో బ్రిటానియా ఇండస్ట్రీస్‌కు ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

ఐటీసీ తరఫున విచారణకు హాజరైన న్యాయవాదులు సాజన్ పూవయ్య, సుదీప్ చటర్జీ, నుపుర్ లాంబా వాదిస్తూ బిస్కట్ ప్యాకెట్లపై హై-ఫైబర్ అన్న పదం ముద్రించడం సర్వసాధారణం అని పేర్కొన్నారు.
బ్రిటానియా న్యాయవాదులు సుదీర్ చంద్ర, సందీప్ సెథీ, జయంత్ మెహతా వాదిస్తూ.. తమ ఉత్పత్తుల లేబుళ్లను పోలి ఉన్న లేబుళ్లను ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ ఆమోదించినట్లు కనిపిస్తున్నదని వాదించారు. ఐటీసీ, బ్రిటానియా బ్రాండ్ల బిస్కట్ ప్యాకెట్లపై ముద్రిస్తున్న లేబుళ్లు పేరొందినవేనని న్యాయస్థానం అభిప్రాయ పడింది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవికూడా చదవండి..
హోమ్‌లోన్‌పై వడ్డీ రేటు పెంచిన ఎస్బీఐ
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ భూమికి కరోనా
కర్ణాటక ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టులో ఊరట
మహారాష్ట్ర హోంమంత్రిపై సీబీఐ ప్రాథమిక విచారణ: హైకోర్టు
కళ్లు చెదిరే రీతిలో రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ లాంచ్.. వీడియో
తప్పు నాదే.. డీకాక్ది కాదు: ఫకర్ జమాన్
హాస్పిటల్లో చేరిన అక్షయ్ కుమార్
కొవిడ్‌తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్‌ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో
స్థిరంగా పసిడి ధర.. స్వల్పంగా తగ్గిన వెండి
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- britania
- Delhi High Court
- itc
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

