విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా 1,600 రోజులుగా అవిశ్రాంతంగా మొక్కలు నాటుతున్న వనజీవి విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ప్రశంసించారు. వాక్ ఫర్ ట్రీస్ అనే మహా యజ్ఞంలో భాగంగా ఐడిఓసి కార్యాలయం ఆవరణంలో..
చుంచుపల్లి, అక్టోబర్ 19 : పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా 1,600 రోజులుగా అవిశ్రాంతంగా మొక్కలు నాటుతున్న వనజీవి విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ప్రశంసించారు. వాక్ ఫర్ ట్రీస్ అనే మహా యజ్ఞంలో భాగంగా ఐడిఓసి కార్యాలయం ఆవరణంలో 1,600వ రోజు 1,600 మొక్కగా పింక్ పనస మొక్కను జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి నాటాడు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వాతావరణం ఎలా ఉన్నా క్రమం తప్పకుండా ప్రతిరోజూ మొక్కలు నాటడం కష్టతరమైన విషయమని, ఒక కఠోర దీక్ష అని అన్నారు. చిన్న వయసులోనే ఇంతటి పట్టుదలతో పర్యావరణం కోసం పనిచేయడం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పర్యావరణ సమతుల్యతకు ప్రాణికోటి మనుగడకు మొక్కల ఆవశ్యకత ఎంతో ఉందని విశ్వామిత్ర ఇచ్చిన ఈచ్ వన్ ప్లాంట్ వన్ నినాదాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. చౌహాన్ కు అభినందనలు తెలుపుతూ జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

