పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ పోలీస్ శాఖకు విశిష్ట సేవలు అందించిన కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్బీ హెడ్ కానిస్టేబుల్, సర్కిల్ ఇన్చార్జి బి.భీముడు, ఏఎస్ఐ సూరయ్యను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.
– కొత్తగూడెం టూ టౌన్ ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ భీముడు, ఏఎస్ఐ సూరయ్యకు ఎస్పీ రోహిత్‌రాజు అభినందనలు
రుద్రంపూర్, అక్టోబర్ 09 : విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ పోలీస్ శాఖకు విశిష్ట సేవలు అందించిన కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్బీ హెడ్ కానిస్టేబుల్, సర్కిల్ ఇన్చార్జి బి.భీముడు, ఏఎస్ఐ సూరయ్యను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు. వారి సేవలను గుర్తిస్తూ ఎస్పీ చేతుల మీదుగా సేవా పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేసే పోలీసు అధికారులు, సిబ్బంది సేవలను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారిలో మరింత ఉత్సాహం పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. సేవా పతకాలు అందుకున్న భీముడు, సూరయ్యలను తోటి అధికారులు, సిబ్బంది అభినందించారు.

పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రోగి మృతి, ఇద్దరికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

